మైసా వచ్చేది అప్పుడే
02-09-2026 | 01:10am
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలమ్స్ నిర్మిస్తోంది. కొద్దిరోజుల క్రితం సెట్స్‌లో గాయపడిన రష్మిక కోలుకుంది. త్వరలోనే చివరి దశ షూటింగ్‌ను పూర్తి చేయనుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న విడుదల కానుంది. తాజా పోస్టర్‌లో రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఈశ్వరిరావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: శ్రేయాస్ పీ కృష్ణ; సంగీతం: జేక్స్ బిజోయ్; స్టంట్స్: ఆండీ లాంగ్.






