05-02-2026 01:16:59 AM
రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్ -డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఇందులో దీపా బాలు కథానాయిక కాగా వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, రూపలక్ష్మి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను టీమ్ బుధవారం విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ.. “రవితేజతో జర్నీ చేస్తున్నప్పుడు మాధవ్‌ని చూస్తూ ఉండేవాణ్ణి. రవితేజ ఎలాంటి బ్యాక్‌గౌండ్ లేకుండా వచ్చారు. తన కాళ్ల మీద తనే నిలబడాలని మాధవ్ కూడా కోరుకుంటున్నారు. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎక్సైటింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నా” అన్నారు. ‘ఈ స్క్రిప్ట్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాన’ని చిత్ర కథానాయకుడు మాధవ్ తెలిపారు. ‘ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా.
అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాన’ని హీరోయిన్ దీపా చెప్పారు. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. “ఇందులో చూపించిన మైసాపురం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కథ, పాత్రలు మా ఊర్లో కూడా జరిగింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది” అన్నారు. నటుడు వికాస్ వశిష్ట, కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.