27 February, 2026 | 1:50 AM

రూ 2 కోట్ల విలువ గంజాయి స్వాధీనం

27-02-2026 12:03 AM

నలుగురి అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం,/చుంచుపల్లి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో గురువారం ఉదయం అక్రమంగా రవాణా అవుతున్న రూ 2.05 కోట్ల విలువగల గంజాయిని చుంచుపల్లి, సీసీఎస్పీ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. వివరాల్లోకి వెళితే.. చెంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్‌జే 09 జీడీ 0686 నంబర్ గల కంటై నర్ కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా అనుమానం వచ్చి సోదా చేశారు.

కొబ్బరి పీచు బండిల్స్ మధ్యలో కవరు చేసి 16 బ్యాగుల్లో 408.185 కిలోల నిషేధిత గంజాయిని రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విలువ సుమారు రూ 2.05 కోట్ల వరకు ఉంటుందన్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తులను విచారించగా చిం తూరు నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అం గీకరించారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ ఫోన్లు, కంటైనర్, 408.185 కిలోల 80 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన బెడ్ జిల్లా గేరాయి మండలం, బెల్గావ్ గ్రామానికి చెందిన సూర్య వంశీ సంతోష్, ఉత్తరప్ర దేశ్ రాష్ట్రం సంబాల్ జిల్లా మాన్పూర్ రష్మీ గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమర్ (కంటైనర్ డ్రైవర్), మల్కాజిగిరి జిల్లా కలిమెల మం డలం చెందిన దెబ్బత చక్రవర్తి ( గంజాయి రవాణా చేయడంలో సహకరించిన వ్యక్తి), ఒరిస్సా రాష్ట్రం, మల్కాన్గిరి జిల్లా మన్యంకొండ గ్రామానికి చెందిన నరతంరాయి లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్‌ఐలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది,చుంచుపల్లి ఎస్‌ఐ రవికుమార్, ఉమాలను ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు.