27 February, 2026 | 1:49 AM

జిల్లా సారథులు సతిపతులు

27-02-2026 12:06 AM
  1. మానుకోట కలెక్టర్‌గా స్నేహ శబరిష్
  2. ఎస్పీగా డాక్టర్ శబరీష్ 

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారుల బదిలీల్లో జిల్లా సారథులుగా దంపతులను కేటాయించడం విశేషం. హనుమకొండ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరిష్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శబరిష్ సతీమణి స్నేహ శబరిష్ కలెక్టర్‌గా బదిలీపై రావడం విశేషంగా మారింది. దంపతులిద్దరూ జిల్లా సారథులుగా బాధ్యతలు నిర్వహించడం జిల్లా ఏర్పడ్డ తర్వాత దశాబ్ద కాలంలో ఇదే ప్రథమం.