25 May, 2026 | 1:00 AM

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

25-05-2026 12:30 AM

ఆదిలాబాద్, మే 24 (విజయక్రాంతి): ఆదిలాబాద్, తాంసి వ్యవసాయ మార్కెట్లను మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మార్కెట్ యార్డుల్లో రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, మౌలిక వసతులను పరిశీలించారు.

జొన్నల కొనుగోళ్లకు సంబంధిం చి రికార్డులను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా వ్యవహ రించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.