10 June, 2026 | 12:08 PM

అగ్గి దగడి

25-05-2026 12:31 AM

నిర్మల్ జిల్లాలో తగ్గని ఎండలు 

నిర్మల్ మే 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆదివారం 45 డిగ్రీలకు పైగా వేసవి ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు అగ్ని గోళంగా మండిపోవడంతో సాయం త్రం వరకు ఆ ప్రభావం కనిపిస్తోంది.

ఐదు గంటల వరకు ఎండ వేడి కారణంగా కారణంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జనాలు బయటకు రాకపోవడం రోలన్ని నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. కూలి నాలి చేసుకునే కార్మికులు రోడ్లపై చిరు వ్యాపారం చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక శీతలపా నీల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.