1 June, 2026 | 2:45 AM

‘మార్క్‌ఫెడ్’ జొన్నల కొనుగోలు షురూ!

01-06-2026 02:07 AM

 క్వింటాకు రూ.3,699 మద్దతు ధర

నాగల్గిద్ద, మే 31: నాగల్గిద్ద మండలంలోని మావినల్లి గ్రామ పరిధిలోని సక్రు నాయక్ తండాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రా న్ని రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జ్యోతి మనోహర్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వం జొన్నలకు క్వింటాల్కు రూ.3,699 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రై తులు దళారులను ఆశ్రయించి తక్కువ ధర కు పంటను విక్రయించి నష్టపోకుండా, నేరు గా కొనుగోలు కేంద్రంలోనే అమ్మి గిట్టుబా టు ధర పొందాలని సూచించారు.

రైతులు పంటను శుభ్రంగా ఆరబెట్టి, తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కేంద్రానికి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే ఆన్లైన్ నమోదు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్లు తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అంజిరెడ్డి పిఎసిఎస్  వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి రూప్సింగ్, దేవరెడ్డి మారు తి, గణపతి, యూత్ కాంగ్రెస్ నాగల్ గిద్ద మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచి న్ పాటిల్, గౌడగం జనవాడ సర్పంచ్ అనిల్ పాటిల్, స్థానిక రైతులు పాల్గొన్నారు.