ట్రిబుల్ ఐటీకి 12 మంది విద్యార్థులు ఎంపిక
తడ్కల్ ప్రభుత్వపాఠశాల విద్యార్థుల రికార్డు
కంగ్టి, మే 31: ట్రిబుల్ ఐటి ప్రవేశ పరీక్షా ఫలితాలలో కంగ్టి మండలం తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయి విజయాలను నమోదు చేశారు. ఈ ఫలితాలలో ఏకంగా 12 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ట్రిబ్యూల్ ఐటి సీట్లను కైవసం చేసుకున్నారు.
ఈ ఘనత సాధించిన వారిలో శ్రేయ, సంజన, రాహుల్ గిరి, నిహారిక, ప్రవళిక, భవాని, లాల్ చంద్, రాగిణి, ఆలేఖ్య, వివేక్, గణేష్, విక్రమ్ ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రహీమోద్దీన్, ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థుల నిరంతర కృషి, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విజేతలైన విద్యార్థులందరికీ, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.






