calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప పరిపాలనాదక్షుడు మర్రి చెన్నారెడ్డి

03-12-2025 01:04:00 AM

-మర్రి చెన్నారెడ్డి వర్ధంతిలో పలువురు వక్తలు

-నివాళులర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు

ముషీరాబాద్,  డిసెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణకు గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు అన్నారు. ఆయన గొప్ప పరిపాలన దక్షుడు, రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమో రియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కులోని రాక్ గార్డెన్‌లో ఉన్న ఆయన సమాధి వద్ద మంగళవారం 29వ వర్ధంతిని మనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలం గాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ ఆధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,  ఎమ్మెల్సీ కొమురయ్య, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ మంత్రి డి కె. సమర సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచం దర్ రావు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి చంద్రశేఖర్, మాజీ ఎంపి వి. హనుమంతరావు,  సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, మర్రి చెన్నారెడ్డి కుమారులు మర్రి శశిదర్ రెడ్డి, మర్రి రవీంర్ రెడ్డి మనుమామలు పురోవర్ రెడ్డి, ఆదిత్య రెడ్డి తదితర కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మర్రి చెన్నారెడ్డికి సమాది వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. అదే విదంగా నిరుపేద ప్రజలకు దుప్పట్లను ఉచితంగా మర్రి శశిధర్ రెడ్డి పంపిణీ చేశారు. 

తెలంగాణకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి చెన్నారెడ్డి: బండారు దత్తాత్రేయ

తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసి తెలంగాణకు గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని ఆయన కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి ముందు చూపున్న నాయకుడని ఆయన పేర్కొన్నారు.

టీపీసీసీ ఆధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏ విషయాన్నైనా సమగ్రంగా తెలు సు కోవాలన్న ఆసక్తిని మర్రి చెన్నారెడ్డి కనబర్చేవారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి ఒక మంచి విజన్ ఉన్న నాయకుడని ఆయన ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి పాటుపడుతున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 

యువతరం చెన్నారెడ్డి చరిత్రను తెలసుకోవాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్

యువతరం మర్రి చెన్నారెడ్డి చరిత్రను తెలుసుకోవాలని, మర్రి చెన్నారెడ్డి స్వగ్రామం తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని తాను రాజకీయంగా ఎగిదేందుకు ఆ గ్రామలమే దోహదపడిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  పేర్కొన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి కేంద్రమంత్రిగా, సిఎంగా, గవర్నర్‌గా ఆయన అ దేశానికి అందించిన సేవలు మరువలేనివన్నారు.

ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని,  ఆయన ఆశయ సాధన కోసం నేటియువత పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడూతూ చెన్నారెడ్డి ఎంతో మందికి రాజకీ యాల్లో మార్గదర్శిగా నిలిచారని ఆన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, బీజేపీ మహంకాళి జిల్లా ఆధ్యక్షుడు భరత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు గౌసొ ద్దీన్, బీజేపీ నాయకకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.