18 March, 2026 | 9:47 PM

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

18-03-2026 08:21 PM

- బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

చేగుంట,(విజయక్రాంతి): ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయని, మన జీవితాల్లోనూ కొత్త ఆశలు,మంచి సంకల్పాలు ప్రారంభం కావాలని చేగుంట మండలం చందాయిపేట్ గ్రామ మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్  ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సరం చందాయి పేట్ గ్రామ, మండలం ఉన్న ప్రజల కుటుంబాల్లో ఆర్థిక, ఆరోగ్య,సంతోషాలను నింపాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖ-దుఃఖాలు సహా వివిధ అనుభవాలను సూచిస్తాయని వాటిని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయన్నారు. పరాభవ అంటే మనలోని అహంకారాన్ని,చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదన్నారు.తెలుగు ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని   ఆకాంక్షించారు.