03-12-2025 12:52:53 AM
మణుగూరు, డిసెంబర్ 2 ( విజయక్రాంతి) : పంచాయతీ పోరు పల్లెలలో హీటెక్కుతోంది. గ్రామాలలో గెలుపు పతాక ఎగరేసేందుకు అభ్యర్థులు పదునైన వ్యూ హాలకు పదునుపెడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలంటే అందరి దృష్టి ఆ సర్పంచి కుర్చీపైనే ఉంటుంది. ఆ ఒక్క పీఠాన్ని దక్కించుకుంటే చాలు, గ్రామంపై జెండా పాతినట్లేనని భావించి ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసు కుంటున్నారు.
ముఖ్యంగా యువత ఎక్కువమంది ఎన్నికల్లో పోటీ చేయడానికిఆసక్తి కనపరుస్తున్నారు. గ్రామ స్థాయి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచ్గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తు న్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నా రు. అంతేకాదు ఇచ్చిన మాట నిలబెట్టు కోక పోతే మధ్యలోనే దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు. పంచాయతీ ఎన్నికలపై విజయక్రాంతి కథనం..
పరుగో పరుగు వారం రోజులే గడువు..
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసు కుంటున్నారు. నువ్వా, నేనా అన్నట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నా, వారిని ఓ సరికొత్త ఆందోళన వెంటాడుతోంది. ప్రత్యర్థులతో పోరుకన్నా ముందు, సమయం తోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆశావహులు గెలుపు వ్యూహాలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
మొదటి విడత ఎన్నికలలో డిసెంబరు 3న అభ్యర్థుల తుది జాబితా, గుర్తు లను ప్రకటిస్తారు. సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే డిసెంబరు 11న పోలింగ్ జరగనుంది. అభ్యర్థుల జాబితా, గుర్తులు ప్రకటించాకే అసలైన ప్రచారం ఊపందుకుంటుంది. పోలింగ్కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంటోంది. ఈ ఏడు రోజుల వ్యవధి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.
ఒక పంచాయతీలో సగటున వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఓటర్లు ఉంటారు. ప్రతి గడప తొక్కి, ప్రతి ఓటరును కలిసి తమ గుర్తును పరిచయం చేసి, ఓటు అభ్యర్థించడానికి వారం రోజులు ఏమాత్రం సరిపోవని ఆశావహులు వాపోతున్నారు. ప్రచారం చేయడం కత్తి మీద సాములా మారిందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
గెలుపు కోసం హామీల వర్షం..
గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడం తో ఈ అవకాశాన్ని వదులు కోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నా లు చేస్తున్నారు. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని గ్రామస్తులను హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తు న్నారు. తమపై నమ్మకం కలిగేలా గ్రామా నికి చేయబోయే పనులు ఇవేనంటూ ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తు న్నారు. దీంతో సోషల్ మీడియాలో అభ్య ర్థుల హామీల జాబితాలు వైరల్గా మారాయి.
సోషల్ మీడియా వేదికగా ప్రచారం..
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఫేస్బుక్, వాట్సాప్లే వేదికగా ఓటు వేయాలని పోటీదారులు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొంతమంది గ్రూపు క్రియేట్ చేసి తమ నాయకులను ఎన్నుకోవాలని ప్రచారం
చేస్తున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో మంది వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, గుర్తు లతో కూడిన స్లిప్పులను మాత్రమే విని యోగించేవారు.ప్రస్తుతం టెక్నాలజీ ప్రభా వంతో పైసా ఖర్చు లేకుండా ఫేస్బుక్, వాట్సాప్లను ప్రచారాస్త్రాలుగా మార్చు కుంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రామాభివృద్ధి గ్రూపులతో పాటు ప్రతి పది మంది స్నేహితులు కలిస్తే ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి పార్టీకి ఒక్క గ్రూపు ఉండటమే కాకుండా అనుబంధ సంఘాలు కూడా ప్రత్యేక గ్రూపుల ను నిర్వహిస్తున్నారు.
వ్యూహం మార్చితేనే విజయం...
రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో కేవలం పార్టీ కండు వాలతో, తమకు కేటాయించిన సింబల్ను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది. ఈ మూడు విడతల్లోనూ ప్రచారానికి కేవలం వారం రోజులే సమయం ఉండటంతో, అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రణా ళికాబద్ధంగా, సమయాన్ని వృథా చేయ కుండా ముందుకు సాగిన వారికే విజయా వకాశాలు ఉంటాయి.
ముఖ్యంగా, రెండు, మూడో విడతల్లో పోటీ చేసే అభ్యర్థులు మొదటి విడత అనుభవాలను పాఠాలు గా తీసుకోవాలి. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాకముందే అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసుకుని, రెబల్స్ బెడద లేకుండా చూసుకుంటే, ఆ సమయాన్ని ప్రచారానికి వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజు ల్లోనే సాంకేతికతను వాడుకుంటూ, ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తేనే ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. అంతిమంగా, ఈ పల్లె పోరులో ప్రత్యర్థు లను ఓడించడమే కాదు, సమయాన్ని జయించిన వారే విజేతలుగా నిలుస్తారు.