26 May, 2026 | 4:36 AM

వివాహిత ఆత్మహత్య

14-12-2024 12:00 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 13: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత విషం తాగి ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకి చెందిన మొక్కపాటి వెంకట  నాగలక్ష్మి(29) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు 5 నెలల క్రితం ఏలూరు జిల్లాకే చెందిన మొవ్వ మనోజ్ మణికంఠతో వివాహమైంది.

మనోజ్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్. ఇద్దరూ కలిసి మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే గురువారం అకస్మాత్తుగా నాగలక్ష్మి విషం తాగడంతో గమనించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులకు సమా చారం ఇవ్వడంతో పాటు కేపీహెచ్‌బిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు.

అయితే నాగలక్ష్మి చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందిం ది.  భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నాగలక్ష్మి తండ్రి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.