26 May, 2026 | 5:29 AM

ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి

14-12-2024 12:00 AM
  • కరీంనగర్ ట్రాఫిక్ సీఐ కరీం 
  • మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో భారికేడ్ల ఏర్పాట్లు

కరీంనగర్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): కరీంనగర్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ సీఐ కరీం అన్నారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో తయారు చేయించిన 50 ట్రాఫిక్ భారికేడ్లను శుక్రవారం ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో అందజేశారు.

ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ... ట్రాఫిక్ నియంత్రణతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్య పడుతుందన్నారు. నగర ట్రాఫిక్ నియంత్రణ కోసం 50 బారికేడ్లు అందజేసిన మెడికవర్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మార్కె టింగ్ హెడ్ కోట కర్ణాకర్, అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.