25 May, 2026 | 11:44 PM

పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి దూకేందుకు యత్నం

14-12-2024 12:00 AM

యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

రాజేంద్రనగర్, డిసెంబర్13: ఓ యువకుడు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లుఓవర్ పైనుంచి దూకేందుకు యత్నించగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని అతడిని కాపాడారు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన జహీర్ శుక్రవారం  శివరాం ప ల్లి సమీపంలో బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నిస్తుండగా ట్రాఫిక్ హోంగార్డు చంద్రమౌలి అతడిని గమనించి కాపాడారు.

అనంతరం లా అండ్ ఆర్డర్ రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. జహీర్‌కు కొంతకాలంగా మతిస్తిమితం లేదని, రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తప్పించుకొని వచ్చాడని జహీర్ సోదరుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం అతడిని తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి ఓ ప్రాణాన్ని కాపాడిన హోంగార్డును ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ అభినందించారు.