calender_icon.png 15 June, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా డి అడిషన్ సెంటర్ ఏర్పాటుకు ఎన్జీవోస్ నుండి దరఖాస్తుల ఆహ్వానం

15-06-2025 12:35:59 AM

మహిళలు, పిల్లలు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మాధక ద్రవ్యాల నిర్వహణను తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక(National Action Plan) పథకం కింద కామారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ డి–అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి, అర్హత కలిగిన సంస్థల(NGOs) నుండి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల(District Welfare Officer Pramila) తెలిపారు. కావున ఆసక్తి, అర్హత కలిగిన సంస్థలు ఈ-అనుదాన్ (http://grants-msje.gov.in/ngo-login) పోర్టల్ లో అప్లై చేసుకోగలరనీ, ఇతర వివరముల కొరకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం రూం.నెం.31 గ్రౌండ్ ఫ్లోర్  కలెక్టర్ కార్యాలయం కామారెడ్డి నందు అన్ని పని వేళలో సంప్రదించగలరనీ ఆమె తెలిపారు. ఇట్టి ప్రతిపాదనకు చివరి తేది:30.06.2025.