30 July, 2026 | 9:47 PM

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..

30-07-2026 09:03 PM

- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్వో విఠల్

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎరాజ్‌పల్లి దేవయ్య నివాస గృహం పూర్తిగా కూలిపోయింది. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తంగా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు దెబ్బతినడంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమాచారం అందుకున్న వెంటనే బోధన్ ఎమ్మార్వో విఠల్ సంఘటన స్థలానికి చేరుకుని కూలిపోయిన ఇంటిని పరిశీలించారు.

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. జరిగిన నష్టంపై సంబంధిత అధికారులతో వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రభుత్వ నిబంధనల మేరకు బాధిత కుటుంబానికి అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో విఠల్ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, ప్రత్యామ్నాయ నివాస సౌకర్యం కల్పించాలని కోరారు.