30 July, 2026 | 9:47 PM

మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన

30-07-2026 09:06 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో బేటీ బచావో-బేటి పడవో కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు మాట్లాడుతూ... మహిళలు లేకుంటే అంతా శూన్యమైన అని వారన్నారు.ఆడపిల్లలను పుట్టనిచ్చి ఎదగనిచ్చి వాళ్లకి విద్యాబుద్ధులు నేర్పించి మంచి గౌరవం దక్కే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనన్నారు.

సమాజం, దేశ అభివృద్ధిలో, కుటుంబ అభివృద్ధిలో ఆడపిల్లల పాత్ర,దేశంలో ఉన్న అత్యంత శక్తీవంతులైన మహిళల గురించి వివరించారు. రాబోయే కాలంలో మహిళలే అన్నీ రంగాలలో ఉంటారని ఆశభావం వ్యక్తం చేశారు. పురిటి లోనే ఆడపిల్లలను స్కానింగ్ చేసి గుర్తించడం చట్టరీత్యా నేరం అని తెలుపడం జరిగింది.మహిళా సాధికారతలో భాగంగా మహిళల రక్షణ,సంక్షేమం, అవసరాల దృష్ట అవసరం అయ్యే ప్రభుత్వ ఉచిత నెంబర్ గ్రామ మహిళలకు తెలుపడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోనే బాలికల నిష్పత్తిలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. లింగ వివక్షతను అరికట్టలీ ఆడపిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూసి బడిలో చేర్పించాలి.సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్షను మార్చాలి. ఈ సమాజంలో మహిళల సాధికారతను సాధించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, అశోక్, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు