19 March, 2026 | 10:20 AM

మాస్ జాతర

31-10-2024 12:00 AM

ప్రేక్షకుల హృదయాల్లో ‘మా స్ మహారాజా’గా స్థానం సంపాదించుకున్నారు టాలీవుడ్ కథానాయకుడు రవితేజ. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. ఈ చిత్రం కోసం ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు.

రచయిత- దర్శకుడు భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకొని ఈ చిత్రం టైటిల్‌ను, విడుదల తేదీని నిర్మాతలు బుధవారం ప్రకటించారు.

‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడిస్తూ విడుదల చేసిన పోస్టర్ కట్టిపడేసేలా ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2025, మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం: విధు అయ్యన్న; ఎడిటర్: నవీన్ నూలి.