పీఓకేలో మళ్లీ మారణహోమం
రాయితీతో పిండి, బియ్యం, విద్యుత్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పాక్‌సైన్యం కాల్పులు
16 మంది మృతి.. మరో 37 మందికి తీవ్ర గాయాలు
ఇస్లామాబాద్, జూన్ 11: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ మారణహోమానికి ఒడిగట్టింది. రాయితీతో పిండి, బియ్యం, విద్యుత్‌ను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. రావలకోట్‌లోని ఈ ద్గా మైదానంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది నిరసనకారులపై గురువారం పాక్ సైన్యం ఏకే-47 గన్‌ల తో ఒక్కసారిగా కాల్పులకు తెగబడింది.
ఈ దారుణ ఘటనలో కనీసం 16 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో 30 మంది ప్రాణా లు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కొనసాగిస్తున్న ఆక్రమణలను, వారి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రావలకోట్‌లో సుమారు 60 వేల నుంచి 70 వేల మంది ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడారు.
సబ్సిడీపై పిండి, బియ్యం, చౌక విద్యుత్, ప్రాథమిక హక్కులను కల్పించాలని, మంగళవారం నాటి ఘర్షణల్లో చనిపో యిన 30 మంది బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాకిస్తాన్ సైన్యం వారిపై నిర్ధాక్షిణ్యంగా తూ టాల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. నిరసన స్థలాలు, రహదారులు, పొలాలు రక్తసిక్తంగా మారాయి. బాధిత కుటుంబాల రో దనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.
ఈ దారుణ కాండకు వ్యతిరేకంగా ఖైగాలా గ్రామంలో స్థానికులు మార్కెట్లను బంద్ చేసి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పీఓకే రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ స్పందిస్తూ, ఎన్ని ప్రాణాలు పోయినా తమ హక్కుల పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరినీ పాకిస్తాన్ ప్రభుత్వం ‘ఉగ్రవాది‘గా ముద్ర వేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ భారీ ర్యాలీలో స్థానిక రాజకీయ నాయకులతో పాటు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ప్రతినిధులు.. అధికారులు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మరణాలపై ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు పీఓకేలోని ప్రస్తుత పరిస్థితులను గమనించాలని, బాధితులకు న్యాయం జరిగేలా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పీఓకేలో నిరసనలపై పా కిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ తీవ్రంగా ఖండిం చింది. రాబోయే ప్రాంతీయ ఎన్నికల కంటే ముందే పాక్ అధికారులు నిరసనలను అణచేస్తున్నారని ఆరోపించింది. ప్రజల ప్రాథ మిక మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.






