26 April, 2026 | 7:26 AM

ఎప్‌సెట్‌కు భారీగా దరఖాస్తులు

28-04-2024 01:47 AM

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): టీఎస్ ఎప్‌సెట్‌కు ఈ ఏడాది భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3,54,393 అప్లికేషన్లు వచ్చినట్లు ఎప్‌సెట్ కన్వీనర్ డా. బీ డీన్ కుమార్ తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,54,158 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ) విభాగానికి 99,890 మంది దరఖాస్తు చేసుకోగా, రెండింటికీ కలిపి 345 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంజనీరింగ్ విభాగానికి దరఖాస్తులు భారీగా వచ్చాయి. నిరుడు ఇంజనీరింగ్‌కు 2,05,351 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 2,54,158 మంది అప్లు చేశారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి గతేడాదిలో 1,15,332 దరఖాస్తులు రాగా ఈసారి 99,890 మాత్రమే వచ్చాయి. టీఎస్ ఎప్‌సెట్ దరఖాస్తు చేసుకునేందుకు మే 1 వరకు గడువు ఉంది. దీంతో దరఖాస్తులు సంఖ్య  పెరిగే అవకాశం ఉంది.