26 April, 2026 | 9:03 AM

వినయ్‌వీర్ మృతి తీరని లోటు

28-04-2024 01:46 AM

l సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): హిందీ పత్రిక మిలాప్ సంపాదకులు వినయ్‌వీర్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపా రు. ఆయన మరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్‌గా హిందీ మీడియాకు ఆయన అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. వినయ్‌వీర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దక్షిణ భారతదేశంలో హిందీ భాషా సాహిత్యం, జర్నలిజం అభివృద్ధి కోసం వినయ్‌వీర్ చేసిన కృషి గొప్పదని కేసీఆర్ తెలిపారు.