ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం
మేడ్చల్, జూన్ 1 (విజయక్రాంతి): ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కోట్లాది రూపాయలను దండుకుని ఉడాయించగా శనివారం బాధితులు పేట్‌బషీరా బాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శెకావత్ సంతోష్, సుగుణ దంపతులు మూడేళ్ల క్రితం కొంపల్లికి వలస వచ్చారు. జయభేరి పార్కు బాలాజీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 204లో నివాసముండేవారు. సంతోష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారినంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. ఈ క్రమంలోనే బల్కంపేట వాసి లోన్ ఏ జెంట్ ప్రవీణ్ ద్వారా పరిచయమైన చింతల్ ప్రసూననగర్‌కు చెందిన నవీన్‌కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.
దీంతో, నిజమని నమ్మి నవీన్ రూ. 6లక్షలు చెల్లించాడు. అంతేకాదు, నవీన్ తన బంధువులు, తెలిసిన వారికి చెప్పి డబ్బు కట్టించా డు. ఇలా ఐదు జిల్లా(మేడ్చల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, సిద్ది పేట)కు చెందిన సుమారు 54 మంది వరకు ఉద్యోగాన్ని బట్టి రూ. 6లక్షలు, రూ. 8లక్షలు, రూ. 10 లక్షల చొప్పున చెల్లించారు. వీరికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి బేగంపేట ఎయి ర్ పోర్టులోని పార్కింగ్ భవనంలో పరీక్షలు రాయించాడు. పార్కింగ్ భవనంలో ఎందుకని బాధితులు అడిగితే లోపలైతే అందరికీ తెలుస్తుందని, ఇక్కడ సీక్రెట్‌గా జరుగుతుందన్నాడు.
కొన్ని రోజుల తర్వాత నవీన్ అనే యువకుడికి అపాయింట్‌మెంట్ ఆఫర్ లెటర్‌ను అందజేశాడు. డబ్బు కట్టి రెండేళ్లు గడు స్తుండటంతో బాధితులు నిత్యం ఫోన్లు చేయ డం, ఇంటికి వెళ్లి కలిసి అడగడం ప్రారంభించారు. అంతేకాదు, సంతోష్ ఇచ్చిన అపా యింట్‌మెంట్ లెటర్‌తో పాటు పరీక్షలు రాసిన హాల్‌టికెట్లు, ఇతర పేపర్లను తీసుకు ని బేగంపేట ఎయిర్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు పేపర్లను చూపించగా అవన్నీ ఫేక్ అని నిర్ధారించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం కొంపల్లిలోని సంతోష్ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సుమారు రూ. 4కోట్లకు పైగా నగదుతో పారిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 3 కోట్లకు పైగా మోసం జరిగినందున కేసును ఎకనామికల్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.






