స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మురళీధర్‌రెడ్డి
02-06-2024 12:29 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (విజయక్రాంతి): గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్‌రెడ్డి శనివారం హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య కల్యాణ మహోత్సవంలో భాగంగా అలివేలు మంగ, భూదేవి సమేతా వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించా రు. అలాగే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి దాకా వెళ్లలేని భక్తులు తిరుమలలోని స్వామి వారిని దర్శించుకుంటే ఎంత అనుభూతి కలుగుతుందో, అంతే అనుభూతి హిమాయత్‌నగర్‌లోని దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుంటే కలుగుతుందన్నారు.






