ఎల్బీనగర్‌కు భారీగా నిధులు
టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
రంగారెడ్డి,ఆగస్టు 2 (విజయక్రాంతి): కాం గ్రెస్ ప్రభుత్వం ఎల్బీనగర్ నియోజకవర్గాని కి భారీగా నిధులు మంజూరు చేసిందని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ ఉమ్మడి డి విజన్ లోని శ్రీనివాస కాలనీలో రూ. 81 లక్షలతో మంజూరైన డ్రైనేజీ పనులకు శంకు స్థాపన చేయగా, రూ, 9 లక్షల వ్యయంతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ కార్పొరేటర్లు ముద్దులచ్చిరెడ్డి, లక్ష్మీ ప్రసన్న గౌడ్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భం గా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ...
సీ ఎం తన సొంత నియోజకవర్గం మాదిరిగా ఎల్బీనగర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో సామాజిక భ ద్రత లభిస్తుందని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎ న్నికలప్పుడే రాజకీయాలు తప్పా.. మిగతా సమయంలో అభివృద్ధి లక్ష్యంగా తాము ప ని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సదాశివుడు, డివిజన్ల అధ్యక్షులు రమేష్ నాయక్, గణేష్ రెడ్డి, శ్రీనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ గౌడ్, రామారావు, నాయకులు శ్రీనివాస్, స్వర్ణమాధవి, కుట్ల నర్సింహా యాదవ్, విద్యా రెడ్డి, సూర్యనారాయణ, శశికాంత్, నందకిశోర్, శ్రీనివాస కాలనీ అధ్యక్షుడు చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.






