13 June, 2026 | 2:02 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

కాంగ్రెస్ హయాంలోనే భారీగా నిధులు

10-02-2026 12:00 AM
  1. హస్తినాపురం డివిజన్ అభివృద్ధికి రూ, 9.80 కోట్లు 

కార్పొరేటర్ సుజాతా నాయక్ 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే డివిజన్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని కార్పొరేటర్ సుజాతా నాయక్ అన్నారు. హస్తినా పురం డివిజన్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి పను లను చేపడుతున్నట్లు తెలిపారు. డివిజన్ లో 9.70 కోట్లతో  సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పార్కులకు మెష్, డ్రైనేజీ నిర్మాణానికి నిధు లు మంజూరు చేసినట్లు తెలిపారు.

వివిధ కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం కార్పొరేటర్ సుజాతా నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రూ.5.5 కోట్ల తో టీకేఆర్ కాలేజ్ రోడ్డు నుంచి సాగర్ ఎం క్లేవ్ కాలనీ వరకు, షిరిడి సాయి కాలనీ, జడ్పీ రోడ్డు నుంచి సాగర్ రోడ్డు వరకు  హస్తినాపురం సౌత్ కాలనీలో ఫుట్ పాత్ నిర్మాణా నికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్ కాలనీ ప్రెసిడెంట్ మంకాల శేఖర్‌రెడ్డి, అమర్నాథ్ యాదవ్, వందనపురి కాలనీ సంక్షేమ సం ఘం గౌరవాధ్యక్షులు చండీశ్వర్, నల్లవెల్లి మనోహర్ రెడ్డి, సాగర్ ఎన్ క్లేవ్ అధ్యక్షుడు  రాములు నాయక్, మైపాల్ రెడ్డి, సత్యం చారి, హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహ, సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.