5 August, 2026 | 1:53 AM

ఎన్టీపీసీ బూడిద రవాణాలో భారీ అక్రమాలు

05-08-2026 12:00 AM

గ్రీన్ ఫీల్ హైవే పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ?

పెద్దపల్లి, ఆగస్టు4 విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నుంచి జ రుగుతున్న ఫ్లై యాష్ (బూడిద) రవాణా వ్య వహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నేషనల్ హైవేస్ అధారిటీ చేపడుతున్న గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనుల పేరుతో కొందరు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల అనుచరులు కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఎన్టీపీసీ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు, పర్యావరణ పరిరక్షణ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.

అక్రమాల తీరు 

ప్రధాన ఆరోపణలు పరిమితికి మించి ఓవర్ లోడింగ్ నిబంధనల ప్రకారం ఒక లా రీలో 32 నుండి 36 టన్నుల వరకు మాత్ర మే బూడిదను రవాణా చేయాల్సి ఉండగా, 70 టన్నులకు పైగా నింపి అక్రమంగా తరలిస్తున్నారు.

వే-బిల్లలో అక్రమాలు & ఖాళీ రశీదులు

రవాణా వాహనాలకు సరైన వే-బిల్లులు ఇవ్వకుండా, ఖాళీ పత్రాలతో లారీలను పం పుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఎన్టీపీసీ యాజమాన్యానికి లెక్కల్లో చూపించకుండా రోజూ లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోందనే విమర్శలు ఉన్నాయి.

రూటు మళ్లింపు, నల్లబజారు

గ్రీన్ ఫీల్ రహదారి నిర్మాణ అవసరాల కోసం ఉచితంగా లేదా రాయితీపై కేటాయించిన బూడిదను ఆ పనులకు వాడకుండా, ఇటుకల బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు మరియు ఇతర ప్రైవేటు ప్రాజెక్టులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పర్యావరణం, రహదారుల ధ్వంసం

పరిమితికి మించి లోడుతో వెళ్తున్న లారీల వల్ల రామగుండం, రాజీవ్ రహదారి పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుమ్ము చేరి ప్రజ లు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నా రు. అంతేకాకుండా రోడ్లు పూర్తిగా ధ్వంసమై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

విచారణకు స్థానికుల డిమాండ్

ఎన్టీపీసీ అధికారుల నిర్లక్ష్యం, రవాణా శాఖ (మరియు పోలీసుల నిఘా లోపం వల్లే ఈ అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ప్రజా సం ఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (MoEF &CC) జారీ చేసిన మార్గదర్శకాలను తుంగ లో తొక్కి సాగిస్తున్న .

ఈ దందాపై విజిలెన్స్ లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే స్పం దించి రవాణా ప్రక్రియలో డిజిటల్ వెయిం గ్ మెషిన్లు, జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పారదర్శకతను కాపాడాలని పెద్దపల్లి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.