డంపింగ్ యార్డ్ తరలించడానికి... ఎమ్మెల్యే మల్లారెడ్డి చేస్తున్న కృషి మరువలేనిది
జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్ నగర్ లో భారీ పాదయాత్ర
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజలకు పెను సవాలుగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించడానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మరువలేమని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా శాంతినగర్, గబ్బిలాలపేట రాజీవ్ గాంధీ నగర్ భాగ్యనగర్ ప్రగతి నగర్ తదితర కాలనీలలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై జరిగే సన్నాహక అవగాహన సదస్సులో భాగంగా సోమవారం బాలాజీ నగర్ ఫైరింగ్ రేంజ్ నుండి జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీసు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు కమిటీ బిఆర్ఎస్ జవహర్ నగర్ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెద్ద ముప్పుగా తయారైందని డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తొలగించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గత ఆరు నెలలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచిత మంచినీరు ఆస్తి పన్ను మాపిచేసి చెత్త లారీల వల్ల దెబ్బతిన్న రోడ్ల ను మరమ్మత్తు చేయాలని, డ్రైనేజీలు లైట్లు తదితర ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని గత అసెంబ్లీలో మల్లారెడ్డి ప్రస్తావించారని గుర్తు చేశారు. జవహర్ నగర్ ఎత్తివేత పోరాట కమిటీకి తమ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గుర్తు చేశారు.






