29 March, 2026 | 4:06 AM

6న పిప్రిలో భారీ బహిరంగ సభ

29-03-2026 02:17 AM
  1. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి 
  2. నేను సీఎల్పీ నేత హోదాలో చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి 
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి  
  4. సభా ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డానికి సీఎల్పీ నేతగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సం దర్భంగా పాదయాత్ర ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

99 రోజు ల ‘ప్రజాపాలన’ ఉత్సవాల్లో భాగంగా భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో  రాష్ట్ర ఉన్న తాధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించగా, మంత్రి జూ పల్లి కృష్ణారావు, ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ మూడేళ్ల క్రితం తాను సీఎల్పీ నేత హోదాలో చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అందుకే ఈ బహిరం గ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, పాదయాత్ర సమయంలో కొన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. 

పీపుల్స్ మార్చ్ వేదికగా పలు సమస్యలకు పరిష్కారం..?

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపి ణీ చేసిన అసైన్డ్ భూములను, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ ద్వారా ప్రొహిబిషన్ (నిషేధిత) జాబితాలో చేర్చిందని, దీనివ ల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి విక్రమార్క గు ర్తుచేశారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాటి సీఎల్పీ నేతగా తాను కలిసి..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను వేధిస్తున్న ధరణిని రద్దు చేసి, పారదర్శకమైన వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ మాట ప్రకారమే అధికారంలోకి రాగానే ‘భూభారతి’ చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములను ‘పార్ట్-బి’ లో పెట్టి రైతులకు హక్కులు లేకుండా చేసిందని, కానీ తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వారి హక్కులను కాపాడుతుందని స్పష్టం చేస్తూ,

ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. 2004లో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కుమ్రం భీమ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటికీ, గత పదేళ్లుగా కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. కుడి, ఎడ మ కాలువలను వెంటనే పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ అభివృద్ధికి  నిధులు కేటాయించాం

చిక్ మాన్, పులిమడుగు, కుప్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తు త స్థితిగతులపై వివరాలు ఆరా తీశారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా సాగును ప్రోత్సహించాలని సూచించారు. గతంలో పాద యాత్ర సందర్భంగా కేస్లాపూర్ లోని నాగో బా దేవాలయాన్ని సందర్శించినప్పుడు, మెస్రం వంశీయులు తమ సమస్యలను వివరించి ఆలయ అభివృద్ధిని కోరిన విషయా న్ని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు.

సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితారా ణా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ కుమ్రంభీం కలెక్టర్ హరిత, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.