10 May, 2026 | 10:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

గద్వాలలో భారీ చోరీ

22-06-2024 03:45 AM

గద్వాల (వనపర్తి), జూన్ 21 (విజయక్రాంతి): గద్వాలలోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. శుక్రవారం ఘటన వెలుగు చూసింది. పట్టణ ఎస్సై శ్రీనివాసులు  తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వ్యాపారి ప్రతాప్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఏపీలోని కర్నూలుకు వెళ్లాడు. తర్వాత గుర్తుతెలియని ఇంట్లోకి ప్రవేశించి బంగారంతో పాటు నగదు అపహరించి ఉడాయించారు. సాయంత్రం ఇంటి మెయిన్ గేట్ తెరిచి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు ప్రతాప్‌కు సమాచారం ఇచ్చారు. ప్రతాప్ ఇంటికి వచ్చి చూసి 30 తులాల బంగారం, రూ.3.50 లక్షలు నగదు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే చోరీలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 

పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే గద్వాలలో జోరుగా చోరీలు జరుగుతున్నాయనిఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రానికి చెందిన వ్యాపారి ప్రతాప్ ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకుని వెంటనే ఆయన బాధితుడి ఇంటిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితుడు గురు వారం రాత్రి పోలీసులు ఆశ్రయించినప్పటికీ, శుక్రవారం ఉదయం వరకు ఘటనా స్థలానికి రాకపోవడం సరికాదన్నారు. చోరీలను అరికట్టడంలో పోలీసులు విఫలమవు తున్నారన్నారు. అనంతరం పోలీసులకు కాల్ చేసి చోరీలను అరికట్టాలని, ప్రతాప్ ఇంట్లో చోరీ కేసు పురోగతిపై ఆరా తీశారు.