17 July, 2026 | 10:24 AM

అల్ఫోర్స్ పాఠశాలలో యోగా డే

22-06-2024 03:43 AM

కరీంనగర్ సిటీ, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శక్రవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హైస్కూల్‌లో యో గా డేను ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... యోగా ద్వారా ప్రతి ఒక్కరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. 

అర్విన్‌ట్రీ పాఠశాలలో..

అర్విన్‌ట్రీ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆసనాలు వేశారు. యోగాతో కలిగే లాభాలను పాఠశాల చైర్మన్ రమణారావు వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.