calender_icon.png 12 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మౌలానా అబుల్ కలాం కృషి

12-11-2025 12:52:56 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, నవంబర్ 11 (విజయక్రాంతి) :  విద్య ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి చేశారని జిల్లా కలెక్టర్ తేజేస్ నంద్ లాల్  పవార్ అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి సందర్భంగా మంగళవారం  కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  ఏర్పాటుచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.   

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ ,పలువురు మైనార్టీ పెద్దలు కలీం అహ్మద్,అబూబాకర్ సిద్ధికి, అంజద్ అలీ, మత పెద్ద అక్తర్ మౌలానా, తెలంగాణ మైనారిటీస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షేక్ బడే సాబ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శంకర్, డి టి ఓ రవి కుమార్, డి డబ్ల్యూ ఓ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.