calender_icon.png 12 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూమోనియాను నియంత్రించవచ్చు

12-11-2025 12:53:21 AM

ముకరంపురా, నవంబర్11(విజయక్రాంతి): న్యూమోనియాను త్వరగా గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని... నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్నిపురస్కరించుకొని మంగళవారం మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ... చలికాలంలో వచ్చే దగ్గు, జలుబును నిర్లక్ష్యం చేయడం, వాతావరణ కాలుష్యం, దూమపానం, ఆహారపు అలవాట్ల మార్పు వల్ల లంగ్స్‌లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి న్యూమోనియా అన్నారు.

  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారితో పాటు ఐదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులకు, వైరల్ ఫీవర్లతో బాధపడేవారికి వ్యాధి నిరోదక శక్తి తక్కువగా ఉండడం కారణంగా న్యూమోనియా త్వరగా సోకే ప్రమాదముందన్నారు. వ్యాధి ముదిరితే వెంటిలేటర్‌కు వెళ్లి ప్రాణాలకు ప్రమాదంగా మారవచ్చన్నారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాన్ని అరికట్టవచ్చన్నారు. న్యూమోనియాకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని, వ్యాక్సిన్‌ను వేసుకోవడం వల్ల న్యూమోనియా నుంచి బయటపడవచ్చని తెలిపారు.

మెడికవర్ సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రచారి, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లోకేష్, ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, ఫెసిలిటీ మేనేజర్ తాళ్లపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.