18 July, 2026 | 10:40 AM

సందీప్ కిషన్ హీరో.. విజయ్ తనయుడి డైరెక్షన్

30-11-2024 12:00 AM

లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ మోషన్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘ఎక్కడ పోగొట్టుకున్నా మో అక్కడే వెతకాలి అనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.

దాని కోసం మనం ఏం వెచ్చిస్తామనేదే ప్రధాన పాయింట్‌గా సినిమాను తెరకెక్కించబోతున్నాం. సందీప్ కిషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే వారి వివరాలను తెలియజేస్తాం’ అని తెలిపారు.