2 May, 2026 | 2:48 AM

కార్మిక హక్కుల సాధనకు కృషి చేస్తా

02-05-2026 02:13 AM

మహిళా కాంగ్రెస్ కార్మిక విభాగం అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ కు మేడే విశిష్ట అవార్డు

చేవెళ్ల మే 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్మిక విభాగం అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ మేడే సందర్బంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రసంగించారు.

కార్మిక సంక్షేమ పథకాల అవగాహనా కార్యక్రమాలకు, కార్మికుల, యాజమాన్యాల మధ్య కార్మిక సమస్యలు, ముఖ్యంగా మహిళా కార్మికుల హక్కులు, సంక్షేమ పథకాల అవగాహన సాధనకు చేసిన కృషికి మెచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ గౌరవ సలహాదారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు చేతుల మీదుగా సన్మాన సత్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ఇంతగా ప్రోత్సాహం అందించిన రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు ఆర్. ప్రకాష్ గౌడ్, ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో కార్మికులు మహిళాకు చట్టాలపై అవగాహన కల్పిస్థానన్నారు. వాడికి అన్యాయం జరగకుండా శ్రమకు తగిన ఫలితం దక్కేలా ప్రభుత్వానికి  కార్మికులకు మధ్య వారధిగా పనిచేస్తానని తెలిపారు.