2 May, 2026 | 2:52 AM

ఘనంగా మేడే వేడుకలు

02-05-2026 02:14 AM

ఘట్ కేసర్, మే 1 (విజయక్రాంతి): వెట్టి చాకిరి, బానిసబతుకు వ్యతిరేకంగా జరుపుకునే కార్మిక దినోత్సవాన్ని (మేడే) ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో పలు కార్మిక సంఘాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నాయి. పలు ప్రాంతాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. మేడే ర్యాలీలు నిర్వహించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో....

అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప, పవర్ గ్రీడ్ కంపెనీ వద్ద గట్టు మైసమ్మ డీసీఎం డ్రైవర్లు సీఐటీయూ జెండాను ఎగురవేశారు. సిఐటియు సీనియర్ నాయకులు చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్. సబిత, ఆయా సంఘాల అధ్యక్షులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో...

ఘట్కేసర్  సర్కిల్ లోని పలు ప్రాంతాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హెచ్ పిసిఎల్ డ్రైవర్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్ కార్మికులు, ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్ సింగ్ కార్మికులు,  నాయకులు జెండా ఆవిష్కరణలు చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈకార్యక్రమాలలో నాయకులు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. జయచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

కార్మికుల రక్షణ చట్టాలను అమలు చేయాలి 

కొడంగల్, మే 1(విజయక్రాంతి): సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే కార్యక్రమాన్ని కొడంగల్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గ కార్యదర్శి ఎం డీ మహ్మద్ ఆధ్వర్యంలో మే డే జెండాను ఘనంగా ఆవిష్కరణ చేశారు.జెండా ఆవిష్కరణ అనంతరం సీపీఐ నాయకులు మాట్లాడుతూ..గతంలో కార్మికుల హక్కులకై సాధించినటువంటి 44 చట్టాలను ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  44 చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నాదన్నారు.

ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విరమించని ఎడల మే డే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధమవుతారాని హెచ్చరించారు .  సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఇంధనూర్ బషీర్ , ఏఐటీయూసీ నాయకులు ముస్తఫా రాములు , కోస్గి మండల నాయకులు చౌడాపూర్ శ్రీనివాస్ కొడంగల్ మండల కార్యదర్శి శ్యామ్ సుందర్,దౌల్తాబాద్ మండల కార్యదర్శి మూతల రాజు,,కే సురేష్ గౌడ్, y.రాజు, శేఖర్. బిచ్చప్ప, మల్లప్ప పాల్గొన్నారు.