2 May, 2026 | 2:52 AM

మాజీ మావోయిస్టుల వాదనలే చట్టాలు

02-05-2026 02:12 AM
  1. వారి ఆమోదం తర్వాతే టీఆర్పీ మేనిఫెస్టో ప్రజల్లోకి
  2. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  3. టీఆర్పీలో భారీగా మాజీ మావోయిస్టుల చేరికలు
  4. పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పటేల్ వనజక్క నియామకం

ముషీరాబాద్, మే 1 (విజయక్రాంతి): మాజీ మావోయిస్టుల వాదనలే చట్టాలుగా మారుస్తామని, వారి ఆమోదం తర్వాతే టీఆర్పీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. శుక్రవారం మాజీ మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీ గా బయలుదేరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ చేరుకున్నారు.

మాజీ మావోయిస్టు దళ కమాండర్ పటేల్ వనజక్క (వనజ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వందలాది మంది అడవి బిడ్డలు, ఉద్యమకారులు, అనుబంధ సంఘా ల నాయకులు టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహి ళా అధ్యక్షురాలిగా పటేల్ వనజక్క మల్లన్న సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. మావోయిస్టులను అన్ని పార్టీలు వాడుకొని వదిలేశాయని విమర్శించారు. గతంలో రాజకీయ పార్టీలు అవసరాల కోసం మాత్రమే ఉద్యమకారులను ఉపయోగించుకున్నాయ ని, కానీ వారికి అసెంబ్లీ వేదిక ఇవ్వలేదని అన్నారు. వనజక్క వంటి నాయకురాలు టిఆర్పి పార్టీలోకి రావడం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు.

ఆమె పోరాట జీవితం ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. అడవిలో మీరు సాధించాలనుకున్న లక్ష్యాలను ఇప్పు డు రాజ్యాంగ బద్ధంగా సాధిద్దాం అని పిలుపునిచ్చారు. ఇది వ్యాపార పార్టీల యుగం కాదని, ప్రజల పార్టీ రాజ్యాధికారానికి రావాల్సిన సమ యం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ భవిష్యత్ రాజకీయ కార్యాచ రణను స్పష్టంగా వెల్లడించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందన్నారు. పార్టీలో, అధికారంలో 50% మహి ళా రిజర్వేషన్ అమలు చేస్తుందన్నారు.

మాజీ మా వోయిస్టుల సలహాలు, ఆమోదంతోనే తుది రూపమన్నారు. జూన్ 2 నుండి పాదయాత్ర ప్రారంభిస్తామని, భారీ బహిరంగ సభ,  భువనగిరిలో వేలాది మంది మాజీ మావోయిస్టులతో మహా గర్జన నిర్వహిస్తామని ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు కూడా కల్పించని వేదికను టీఆర్పీ కల్పించిందని, ఇది మెజారిటీ వర్గాల పార్టీ అని అన్నారు. 2029లో కచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీల ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘పార్టీలో చేరిన మాజీ మావోయిస్టు నాయకులు మాట్లాడుతూ ఏండ్ల తరబడి మేము అడవుల్లో జీవిస్తూ  పీడిత వర్గాల కోసం పోరాటం చేశాం. కానీ మా లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదన్నారు.

ఇప్పుడు మల్లన్న మమ్మల్ని ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకువస్తూ  అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా నిలబెడతామని హామీ ఇస్తున్నారు’ అని అన్నా రు.  పటేల్ వనజక్క మాట్లాడు తూ.. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టినప్పటి నుం డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని తనను ఆహ్వానించారని, తన మిత్రులతో ఆరు నెలల పాటు చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని వనజక్క తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూ స్తుంటే మనం మనుషులమేనా అన్నసం దేహం కలుగుతుండటంతో, ఇక ఆలస్యం చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. సమాజంలో కుక్కలకు, నక్కలకు, చెట్లకు అ న్నింటికీ లెక్కలు ఉన్నాయి కానీ, బీసీలకంటూ ఒక లెక్కగానీ, పత్రంగానీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా ఎన్నో పార్టీలు బీసీలను కులాల పేరుతో వంద రకాలుగా మోసం చేస్తూనే ఉన్నాయని, అందుకే బీసీల కోసం మల్లన్న నాయకత్వంలో ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఏర్పడింద న్నారు. బడు గు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తీన్మార్ మల్లన్న ఉన్నారని కొనియా డారు. ప్రశ్నించేవాడు ఉండకూ డదన్న ఉద్దేశ్యంతో, బీజేపీ ప్రభుత్వం అడవులన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో ఉపేంద్ర భాయ్, న్యాయవాది పద్మ క్క, రమ్య, అనసూర్య, స్వర్ణక్క, ప్రవీణ్, దాడి రవన్న, సంఘం సామన్న, బాబన్న, రవి, భిక్షపతి యాదవ్, పృథ్వి, సరిత, ఎల్లన్న, రాజన్న యాదవ్, సాయి కృష్ణ, రమణ తదితరులు ఉన్నారు.