30 July, 2026 | 1:08 AM

బాబా ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి

30-07-2026 12:00 AM
  1. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
  2. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు 

గణపురం,: జులై 29 (విజయ క్రాంతి): బాబా ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురు పౌర్ణమి పర్వది నం సందర్భంగా మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర, సత్యనారా య ణరావు, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లతో కలిసి అభిషేకః నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వినయ్ నిర్వహించారు. తీర్థ ప్రసాదాల అనంతరం దుగ్యాల ఆగమ రావు, అమృతమ్మ, నారాయణరావు స్వరూప దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.