భక్తిశ్రద్ధలతో గురుపూర్ణిమ వేడుకలు
- భక్తులతో సాయిబాబా ఆలయం కిటకిట
- విప్ ఆది శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల ప్రత్యేక పూజలు
వేములవాడ, జూలై 29 (విజయక్రాంతి): వేములవాడలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో అధ్యక్షుడు వీ దేవయ్య ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు గురుపూర్ణిమ వేడుకలను బుధవారం నిర్వహించారు. తెల్లవారుజామున కాకడ హారతితో ప్రారంభమైన ఉత్సవాల్లో గణపతి పూజ, క్షీరాభిషేకం, పుష్పార్చన, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు.
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్ దంపతులు, 25వ వార్డు కౌన్సిలర్ కొక్కు ల బాలకృష్ణ, పట్టణ సీఐ వీరప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రామకృష్ణ, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ తదితర ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






