30 June, 2026 | 11:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

12-05-2025 12:50 AM

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే11:   జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ ఉత్సవాలలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డింపుల్ దంపతులు,కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్సేన పూజ,పుణ్యాహవచనం,హోమం,రుత్విక్ వరణం,లక్ష కుంకుమార్చన,తిరువెంకటపతి అలంకార సేవ నిర్వహించారు.అలాగే కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ ముఖ్యమని,పాకిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో భారత్ కు విజయం లభించాలని,ఆపరేషన్ సింధూరలో పాల్గొన్న ప్రతి సైనికునికి సంఘీభావం తెలియజేస్తూ సంకల్పం చేసి ఉత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధకిషన్ రావు,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,ఆలయ ధర్మకర్తలు జేరిపోతుల సోమయ్య,

ఆకుల సోమయ్య,బీరెల్లి శ్రీధర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు పెసర సతీష్ రెడ్డి,వేములకొండ ఉప్పలయ్య,నర్సింగ కృష్ణమూర్తి,దోరెపల్లి మధు,మేకల రాంబాబు,బాకు మల్లయ్య,బాషపోలు శ్రీను,కందుకూరి మహేష్,బింగి కృష్ణమూర్తి,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.