12-05-2025 12:49:01 AM
కోదాడ మే 11: కోదాడ పట్టణంలో రైజింగ్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, జన విజ్ఞాన వేదిక సారధ్యంలో జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బాల విజ్ఞాన సమ్మేళన, వేసవి శిక్షణ శిబిరం ల ను ఆదివారం పట్టణ ప్రముఖ న్యాయవాది మేకల వెంకట్రావు సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
తదుపరి స్టేట్ రిసోర్స్ పర్సన్ సైన్సు ఉపాధ్యాయులు జాఫర్ వైశాల్యము, బరువు, పీడనంకు సంబంధించి పేపరు - వాటర్ బకెట్ ద్వారా చేసిన ప్రయో గం విద్యార్థులను బాగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ , ఉపాధ్యా యులు ఎస్.కె. ఖజానీయా, బడుగుల సైదులు పాల్గొన్నారు.