12-05-2025 12:51:51 AM
యాదాద్రి భువనగిరి మే 11 ( విజయ క్రాంతి ): ఆర్మీ రక్షణ నిధికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుమారుడు బీర్ల శివమణి (10) బాలుడు తన కిడ్డి బ్యాంక్ నుంచి లక్ష రూపాయల విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ హనుమంత రావుతో ఫోన్ లో మాట్లాడుతు సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆర్మీ సైనికుల కోసం లక్ష రూపాయలు అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శివమణిని అభినందించారు ఇంత చిన్న వయసులో ఆర్మీ రక్షణ దళానికి విరాళం ప్రకటించాలని ఆలోచన రావడం ప్రశంసనీయమన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆర్మీ రక్షణ నిధికి నెల జీతం తో పాటు బీర్ల ఫౌండేషన్ నుండి రక్షణ శాఖ కు విరాళాన్ని అందజేయనున్నారు.