6 May, 2026 | 8:15 AM

నరసింహుడి కటాక్షం ఉండాలి

28-11-2024 02:06 AM
  1. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. సుందిళ్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు

మంథని, నవంబర్ 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నరసింహస్వామి వారి కటాక్షం ప్రజలందరిపైనా ఉండాలని, స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం, నియోజకవర్గంలో రైతులు పాడి పంటలతో తులతూగాలని మంత్రి శ్రీధర్‌బాబు కాంక్షించారు. అనంతరం విఖనస సుధర్మా సేవా సమితి ఆధ్వర్యంలో సర్వకామప్రద సుదర్శన సహిత లక్ష్మీనరసింహ యాగ వైభవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.