6 May, 2026 | 2:18 AM

నైపుణ్యాలు మెరుగవ్వాలి

06-05-2026 01:24 AM
  1. దీంతో అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు
  2. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చు 
  3. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 
  4. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు 
  5. వైద్య విద్యలో ఏఐ ఉపయోగంపై కమిటీ వేస్తాం 
  6. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రం గాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రిజ ర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. మానవ వనరుల అభివృద్ధికి పోషకాహార లోపం సమస్యను తగ్గిం చుకోవాలని సూచించారు. మంగళవారం తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రఘురామ్ రాజన్ పలు సూచనలుచేశారు.

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రఘురామ్ రాజన్‌తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానంపై ఆధారపడి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని రఘురామ్‌రాజన్ చెప్పారు. స్టార్టప్‌లను ఎక్కువగా ప్రోత్సహిస్తే మరింత ఉప యోగం ఉంటుందని సూచించారు.

పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిలబస్‌లో ఏఐ ఉపయోగంపై కమిటీ ఏర్పాటు చేస్తామని, తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రఘురామ్ రాజన్‌ను ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. దీంతోపాటు మిడిల్ లెవల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ వర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్న ట్టు సీఎం వివరించారు. సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చునని సూచించారు. డాటా సెంటర్ల కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూడు నాలుగు నెలల్లో హైదరా బాద్ పర్యటనకు వస్తానని రఘురామ్ రాజన్ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని స్పష్టంచేశారు.

కావాల్సిన భూమితోపాటు మౌలిక సదు పాయాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ వి మానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డుతోపాటు అనేక సదుపాయాలు సిద్ధంగా ఉన్నా యని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు రేడియల్ రోడ్లు, పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని వివరించారు. శాంతిభద్రతలను పటి ష్టంగా నిర్వహిస్తున్నామన్నారు.

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలిపారు. క్యూర్, ప్యూ ర్, రేర్ మోడల్‌లో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పుతున్నట్టు తెలిపారు. సులభతర వ్యాపారానికి అనుగుణంగా తెలంగాణలో పరిస్థితు లు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

ఫార్మా, ఐటీ, డాటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావరణం, వసతులు కల్పిస్తున్నట్లు రఘురామ్ రాజన్‌కు వివరించారు. కార్యక్రమంలో సీఎస్ రామక్రిష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీల జయేశ్‌రంజన్, వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.