6 May, 2026 | 2:22 AM

నిబంధనలతో పనేంటి?

06-05-2026 01:05 AM
  1. రోడ్డు పక్కనే ఇటుకల బట్టీలు
  2. బట్టీల్లో వంట చెరుకు వినియోగం
  3. పట్టించుకోనీ అటవీ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, మే 5, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లె మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏదేచగా సాగుతున్నాయి. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో రెవెన్యూ అధికారులతో నాలా పర్మిషన్ ఉంది ఇటుక బట్టీలను నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టిలను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలనే నిబంధనను సహితం ఇటుకల వ్యాపారులు విస్మరించారు.

అనిశెట్టిపల్లి సమీపంలో రోడ్డుకు ఆనుకొని ఓ యజమాని ఇటుకల బట్టిల కార్ఖానాన్ని ఏదేచ్ఛగా సాగిస్తున్నారు. ఎంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అవినీతి ఆరోపణలకు దారితీస్తోంది. ద్విచక్ర వాహనం పై ఆ మార్గంలో ప్రయాణించే వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యం కలిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇటుకలు కాల్చేందుకు అడవి దుంగలు 

ఒకవైపు ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా లారీల కొద్దీ తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా తయారైన ఇటుకలను బట్టి వాటిని కాల్చేందుకు అడవి దుంగలను యదేచ్చగా నరికి  పెద్ద మొత్తంలో అక్రమంగా తరలించి కాలుస్తున్నారు.

వంట చెరుకు తరలిస్తేనే కఠిన చర్యలు తీసుకుని అటవీశాఖ అధికారులు పెద్ద పెద్ద అడవి దుంగలను అక్రమంగా తరలించి కాల్చి వేస్తుంటే ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా అడవిని నరికి దిమ్మలను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

తనిఖీలు చేశాము.. కలపను సీజ్ చేసాం : కొత్తగూడెం రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ 

లక్ష్మీదేవి పల్లె మండలం అని శెట్టిపల్లి ప్రాంతంలో ఇటుక బట్టీలకు అడవి దిమ్మెలను వినియోగిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఇటుక బట్టీల వద్ద  తనిఖీలు చేశామని, అక్రమంగా నిల్వ ఉన్న అటవీ ధిమ్మెలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశామన్నారు.