తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తది
ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
ముషీరాబాద్, మే5 (విజయక్రాంతి): పశ్చిమబెంగాల్ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు బిజ్జి కనకేష్ కుమార్ ఆధ్వర్యంలో బాకారం, గాంధీనగర్‌లో ఏర్పా టు చేసిన చలివేంద్రాన్ని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మ ణ్ హాజరై ప్రారంభించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల10న జరగనున్న బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారని, ఆయన పర్యటన అనంతరం తెలంగా ణ రాజకీయాలలో పెను మార్పులు సంభవిం చే ఆస్కారం ఉందన్నారు. కేసీఆర్ కాలంలో అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన కొనసాగిందని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఢిల్లీ కుటుంబానికి చేరవేస్తున్నాడని విమర్శించారు. అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌ను బిజ్జి కనకేష్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, భోలక్ పూర్‌డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, శివ, బీజేపీ రాష్ట్ర నాయకులు కె. రాహుల్, నందగిరి నర్సింహ, చంద్రమోహన్, నగర నాయకులు కృష్ణ, సత్యనారా యణ, సురేష్ కుమార్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.






