26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన

02-04-2026 12:00 AM

బూర్గంపాడు, ఏప్రిల్1 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం 6 నెలలు నిండిన పిల్లలకు గ్రామ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావులు సామూహిక అన్న ప్రాసన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అంగన్వాడి కేంద్రంలో బాలింత తల్లులకు,పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన భోజనాన్ని,ఇతర కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం అంగన్వాడీ సిబ్బంది నూతన సర్పంచ్,ఉప సర్పంచ్ లను సన్మానించారు.ఏఎల్‌ఎంసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పుల్లమ్మ,ఎంపీపీఎస్ హెఎం కోటేశ్వరరావు,సురేష్, వెంకటేశ్వర్లు,దేవా,రాజు పాల్గొన్నారు.