28 May, 2026 | 1:55 AM

గ్రామీణ పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు

28-05-2026 12:27 AM

బోథ్. మే 27( విజయక్రాంతి) సమీప భవిష్యత్తులో గ్రామీణ పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగానే బుధవారం నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామాన్ని పర్యాటక శాఖ ప్రతినిధులు సందర్శించారు .హోం స్టే క్లస్టర్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల సహజ సౌందర్యం స్థానిక సంస్కృతి సాంప్రదాయ జీవన విధానం గ్రామీణ జీవనశైలిని సమగ్రంగా అధికారుల బృందం పరిశీలించింది.

అందులో భాగంగా ఏర్పాటు చేసిన హోం స్టే సౌకర్యాలను పరిశీలించి గ్రామ ప్రజలు పర్యాటకులకు అందిస్తున్న వసతి ఆహార సేవలు అతిత్య విధానం పైన తెలుసుకొని సంతృప్తి వ్యక్తపరిచారు.స్థానిక వంటకాలు జానపద కళలు సాంప్రదాయ హస్తకళలు మరియు గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి వారిని అభినందించారు .గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ పర్యాటక అనుకూల వాతావరణం కల్పనపై గ్రామస్తులతో చర్చించారు .

పర్యాటక రంగం అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. స్టే క్లస్టర్ విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామాల ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసే వీలుంటుందని పేర్కొన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని వారే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది అన్నారు.అయితే పర్యాటక. రంగప్రతినిధులు గ్రామానికి వచ్చి పరిశీలించడంతో స్థానికంగా ఉన్న ప్రజల్లో పర్యాటక రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం లభిస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందే వీలుంది.