నాటకీయ పరిణామాల మధ్య కోఆప్షన్ ఎన్నికలు
ఎజెండా కాపీలు అందలేదంటూ సమావేశాన్ని వాయిదా వేస్తూ బయటకు వెళ్లిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు
ఆదిలాబాద్, మే 27 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చే సుకున్నాయి. తొలుత ఎజెండా కాపీ లు అందలేదని సమావేశం వాయిదా వేస్తున్న ట్లు చెప్పిన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అ నూష తో పాటు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎం ఐఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే బీజేపీ ఎంపీ, ఎ మ్మెల్యే లు స్పందించి కోరం ఉన్నప్పటికీ సమావేశాన్ని వాయిదావేయడాన్ని తప్పుబట్టారు.
మున్సిపల్ యార్డు 2019 సెక్షన్ 5 ప్రకారం కోరం సభ్యుల్లోనే ఒకరిని తాత్కాలిక చైర్పర్సన్ గా నియమించుకొని ఎన్నికను కొనసాగించారు. తమకు పూర్తి సభ్యుల మెజారిటీ ఉండటంతో నాలుగు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని బీజేపీ వెల్లడించింది. 21 మంది బిజెపి కౌన్సిల్ సభ్యులు, నలుగురు స్వతంత్రులు, ఎక్స్ ఆఫిషియో సభ్యుల హోదాలో ఎంపి నగేష్ , ఎ మ్మెల్యే పాయల్ శంకర్ లు మొత్తం 27 మంది మద్దతుతో నలుగురు కో ఆప్షన్ స భ్యులుగా భరత్ కుమార్, సంగీత, ఇమ్రాన్, కరుణలను ఎన్నుకున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెసకు చెందిన 12 మంది కౌన్సిలర్లతో పాటు బిఆర్‌ఎస్ కు చెందిన ఆరుగురు, ఎంఐఎం సభ్యులు ఆరుగురితో ఎమ్మెల్సీ దండే విఠల్లు ఎన్నికలో పాల్గొనాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ దండే విఠల్ తనకు ఎజెండా ప త్రాలు అందలేదంటూ గైర్హాజరవడంతో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉత్కంఠ నెలకొంది. కొద్ది నేపటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు వారికి మద్దతుగా నిలిచిన బిఆర్‌ఎన్, ఎంఐఎం సభ్యులు సైతం తమలో కొందరికి ఎజెండా కాపీలు అందలేదని.. కొందరి సంతకాలు పోర్జరీ చే శారని ఆరోపిస్తూ సమావేశం ఉండి బయట కు వెళ్లిపోయారు.
అటు కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ సైతం ఎలాంటి ప్రకటన చేయ కుండానే కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశం ఉందా లేదా అని వెల్లడించాల్సి న అధికారే ఎన్నికపై ఎలాంటి స్పష్టత నివ్వకుండా వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ ఎంపి, ఎ మ్మెల్యేలతో పాటు బీజేపీ కి చెందిన కౌన్సిలర్లు సమావేశ మందిరంలోనే ఉండిపోయా రు. సభ్యులకు ఎజెండా కాపీలు అందక పోవడంతోనే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ బండారి అనూష వెల్లడిం చారు.
మూడు రోజులుగా ఎజెండా కాపీలు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికను నిర్వ హించాల్సిన కమీషనర్, జిల్లా అధికార యం త్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించ డం చట్ట విరుద్దమన్నారు. మున్సిపల్ యా క్టు 2019 సెక్షన్ 5 ప్రకారం చైర్మన్, వైన్ చైర్మన్లు సభ్యులుగానే పరిగణించబడతారని.. వారికి ఎన్నికను వాయిదా వేసే అధికారం ఉండదని పేర్కొన్నారు.
అందుచేతనే సీనియర్ సభ్యురాలైన ధోని జ్యోతిని తాత్కాలిక చైర్మన్ గా ఎన్నుకొని 27 మంది సభ్యుల మ ద్దతుతో నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎ న్నుకుననట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే పా యశంకర్ మాట్లాడుతూ ఎన్నికల ఆధికాగా వ్యవహరించాల్సిన కమీషనర్ కాంగ్రెస్ ఏజెంటుగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహించకుండానే వెళ్లిపోవడంపై మండిప డ్డారు. 2019 మున్సిపల్ చట్టం నెక్షన్ 5 ప్రకారం చైర్మన్, వైన్ చైర్మన్ అనుపస్థితిలో సీనియర్ సభ్యుడిని తాత్కాలిక చైర్మన్ గా ఎన్నుకుని ఎన్నికల కొనసాగించే అవకాశం ఉందన్నారు.
దీని ప్రకారమే తాము సీనియర్ కౌన్సిల్ సభ్యురాలైన ధోని జ్యోతిని చైర్మన్ గా ఎన్నుకొని కోఆప్షన్ సభ్యుల ఎన్నికను పూర్తి చేశామ న్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తో తమకు పొత్తులేదని ప్రగల్బాలు పలికిన మాజీ మంత్రి కాంగ్రెస్, ఎంఐఎంతో జతకట్టడం ఈ సంఘటనతో మరింత స్పష్టమైందన్నారు.






