10 March, 2026 | 7:29 PM

గాలి కుంటు వ్యాధి నివారణకు చర్యలు

10-03-2026 06:00 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పశువులను గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు అంకుషాపూర్ గ్రామంలో మంగళవారం ఉచిత టీకాల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ సురేష్ కుమార్, గ్రామ సర్పంచ్ టేకం గంగారాం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు.

గాలి కుంటు వంటి అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకాల కార్యక్రమంలో రైతులు చురుకుగా పాల్గొని తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో గ్రామంలోని సుమారు 400 పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో పశు వైద్య అధికారి డాక్టర్ మురళీ కృష్ణ, పశు వైద్య సిబ్బంది మోతీరం, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.