మెదక్ ఖిదక్‌కు దేశస్థాయిలో గుర్తింపు తేవాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 11(విజయ క్రాంతి) : మెదక్ దేశ స్థాయిలో గుర్తింపు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం మెదక్ ఖిదక్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టూరి జం సెక్రటరీ వాణి ప్రసాద్ సహకారంతో మెదక్ ఖిదక్ పర్యాటక ప్రాంతంగా అభివృ ద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ముందుచ్చుతామని దానికి అనుగుణంగా ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేష్ ఇతర అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తో మెదక్ ఖిదక్ ను సందర్శించారు.
మెదక్ ఖిదక్ ఉన్న గజశాల, దర్వాజాలు,జైలును తదితర చారిత్రక అంశాలను కలెక్టర్ ప్రతిమ సింగ్ అడిగి తెలుసుకు న్నారు. మెదక్ ఖిదక్ పైన ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ శిథిలావస్థకు చేరింది అనే అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో భాగంగా ఈరోజు పైన అడ్డదిడ్డం గా పెరిగిన చెట్ల మొక్కలను, ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.మెదక్ జిల్లాలో దొరికిన పురావస్తు విగ్రహాలు, తదితర శాసనాలు, వివిధ అంశాలతో మెదక్ ఖిదక్ మ్యూజియంను ఏర్పాటు చేసి మెదక్ జిల్లా చరిత్రను చెప్పే విధంగా పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు.






